News March 9, 2025
సిరిసిల్ల SP ఫుల్ డీటెయిల్స్

రాజన్న సిరిసిల్ల జిల్లా SPగా నియామకమైన మహేష్ బాబా సాహెబ్ గీతే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జన్మించారు. ఈయన అగ్రికల్చర్ BScలో డిగ్రీ పట్టాపొందారు. ఎలాంటి కోచింగ్ లేకుండానిరంతర సాధనతో 2020లో IPSకు ఎంపికయ్యారు. మొదట చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్ విధులు నిర్వహించారు. తర్వాత ఏటూరు నాగారం ASPగా పనిచేశారు. ప్రస్తుతం ములుగు జిల్లా OSDగా బాధ్యతలు నిర్వహిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా వచ్చారు.
Similar News
News March 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 10, 2025
నల్గొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్‌కు ఈసారి అవకాశం కల్పించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.
News March 10, 2025
CT: అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(263) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. 4 మ్యాచుల్లో రెండు సెంచరీలు చేశారు. ఇక తర్వాతి స్థానాల్లో భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(243), బెన్ డకెట్(227), జో రూట్(225) ఉన్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ(10W), వరుణ్ చక్రవర్తి(9), సాంట్నర్(9), షమీ(9), బ్రేస్ వెల్(8) ఉన్నారు.