News April 4, 2025

సిరిసిల్ల: అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయాలి: అదనపు కలెక్టర్

image

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ రేషన్ కార్డుల జారీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాపాలన, మీ సేవా, ఇతర మార్గాల ద్వారా రేషన్ కార్డుల జారీ కోసం వచ్చిన 30,977 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Similar News

News April 18, 2025

నల్గొండ: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి అప్పగింత

image

మనస్తాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి తిరిగిరావడంతో ఆమెను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని తల్లీ కూతుర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు 2 టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. నల్గొండ శివాజీ నగర్ ఏరియాలోని ఎన్జీ కాలనీకి చెందిన ఓ యువతి ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మనస్తాపం చెంది మార్చి 1న ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను తిరిగి అప్పగించారు.

News April 18, 2025

చెత్త నుంచి సంపదతోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యం: సీఎం

image

AP: స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ‘ఈసారి e-వ్యర్థాల సేకరణ-సురక్షితంగా రీసైకిల్ చేయడమనే థీమ్‌ను ఎంచుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టితోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది వ్యర్థాల సేకరణ కేంద్రాల నినాదం కావాలి. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి’ అని ట్వీట్ చేశారు.

News April 18, 2025

నల్లాలకు మోటార్లు బిగిస్తే చర్యలు: SRPT కమిషనర్

image

సూర్యాపేట పట్టణంలో నల్లాలకు నేరుగా మోటార్లు పెట్టి నేరుగా నీటిని వాడుకుంటున్న 18, 34, 35 వార్డుల ఇళ్లలో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నీటిని పట్టుకుంటున్న 10 మోటార్లు సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తెలిపారు. గృహ యజమానులు నీటి పంపుకు నేరుగా మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!