News March 29, 2024

సిరిసిల్ల: ఆధారాలు లేకుండా తరలిస్తే సీజ్ చేయండి: కలెక్టర్

image

ఎటువంటి ఆధారాలు లేకుండా రూ.50,000 మించి నగదు తరలిస్తే సీజ్ చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం వాహనాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపించాలని అధికారులు ఆయన ఆదేశించారు.

Similar News

News October 4, 2024

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా(15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్‌తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 4, 2024

కరీంనగర్: నేడు ముద్దపప్పు బతుకమ్మ

image

కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి పూజలు చేస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా పిలుస్తారు. మూడోరోజు వాయినంగా ముద్దపప్పు, సత్తుపిండి, పెసర్లు, బెల్లం కలిపి పెడతారు.

News October 4, 2024

దుర్గామాతను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి

image

రామగుండం మున్సిపల్ పరిధిలోని 42వ డివిజన్, 50వ డివిజన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గామాతను మొదటి రోజు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.