News April 12, 2025

సిరిసిల్ల: ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఈనెల 21 లోపు ముంపు గ్రామాల ప్రజలు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఈనెల 11 నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News April 19, 2025

ఒకే రోజు ఓటీటీ, టీవీల్లోకి కొత్త సినిమా?

image

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ ZEE5లో మే 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజున జీ తెలుగు ఛానల్లోనూ రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఒకే రోజున OTT, టీవీల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

News April 19, 2025

గుంటూరు: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల జోరు

image

జేఈఈ మెయిన్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఏపీ నుంచి జి.సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి ఫిమేల్ కేటగిరీలో దేశస్థాయిలో టాపర్‌గా నిలిచింది. ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకుతో మెరిసింది. మొత్తం 100లోపు 16 మంది, 200లోపు 28, 500లోపు 60, 1000లోపు 82 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని శనివారం గుంటూరులో భాష్యం ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. 73.24% సక్సెస్‌ రేటు సాధించామన్నారు.

News April 19, 2025

NZB: సన్న బియ్యం లబ్ధిదారులతో మైనారిటీ కమిషన్ ఛైర్మన్ భోజనం

image

నిజామాబాద్ గౌతంనగర్‌లో సన్న బియ్యం లబ్ధిదారుడైన లింబాద్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!