News February 26, 2025
సిరిసిల్ల: ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 22,397 మంది పట్టభద్రులు, 950 మంది ఉపాధ్యాయులు ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రతి పట్టభద్రుడు, ఉపాధ్యాయుడు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News February 27, 2025
సిరిసిల్ల: డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఏపీవో, పిఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు, అధికారులు పోలింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కగా అందించాలని పేర్కొన్నారు.
News February 27, 2025
ఎన్నికలకు 400 మందితో బందోబస్తు: ADB SP

నేడు జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ADB జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News February 27, 2025
నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 27, గురువారం

ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.