News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్

కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
Similar News
News December 14, 2025
సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగిన ADB కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా పలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావల మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్లు అందంగా తయారు చేశారు. కేంద్రం పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓటర్లతో కలిసి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగారు.
News December 14, 2025
KCRకి ఉన్న చరిష్మా వాళ్లెవరికీ లేదు: టీపీసీసీ చీఫ్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘KCRకి ఉన్న చరిష్మా వాళ్ల కుటుంబంలో ఎవరికీ లేదు. పార్టీని నడపడం KTR వల్ల కాదు. BRSను హరీశ్ చీల్చుతాడు. ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకొస్తుంది. KTR డబ్బులు పెట్టి సోషల్ మీడియాతో నడిపిస్తున్నాడు’ అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. CBN పెట్టుబడులు పెట్టాలని ఎంత ప్రచారం చేసినా ఇన్వెస్టర్లు HYD వైపే చూస్తున్నారని అన్నారు.
News December 14, 2025
జగిత్యాల: ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్

జగిత్యాల జిల్లాలో రెండో విడత జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండడంతో ఇక సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది. ఇన్ని రోజులు తాము పడ్డ కష్టం ఎలా ఉంటుందోనని ఫలితం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


