News January 31, 2025
సిరిసిల్ల: కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి: ఎన్నికల అధికారి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలుచేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్‌తో శుక్రవారం మాట్లాడారు. పట్టభద్రుల, టీచర్ల ఓటర్ నమోదు పెండింగ్ దరఖాస్తులను ఫిబ్రవరి 7లోపు పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రాజకీయ పార్టీల హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు తొలగించాలన్నారు.
Similar News
News March 1, 2025
ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం

AP: అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఆ బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం శరత్ అనే కళాకారుడిని ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల శకటం ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
News March 1, 2025
BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.
News March 1, 2025
నంద్యాల జిల్లా టుడే TOP NEWS

☞ గాలికుంటు టీకాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్ ☞ PMAY కింద జిల్లాకు 59,255 గృహాల మంజూరు: హౌసింగ్ పీడీ ☞ ఇంటర్ విద్యార్థులకు నంద్యాల ఎంపీ ఫోన్ ☞ మహిళా దినోత్సవం.. నంద్యాలలో భారీ ర్యాలీ ☞ రోజాకు ఎమ్మెల్యే అఖిలప్రియ కౌంటర్ ☞ బడ్జెట్ లో రాయలసీమకు తీవ్ర అన్యాయం: కాటసాని ☞ పింఛన్ల పంపిణీలో మంత్రి బీసీ ☞ ఇంటర్ పరీక్షలకు 595 మంది డుమ్మా ☞ శ్రీశైలంలో నకిలీ నోట్ల కలకలం ☞ 93.74% పింఛన్ల పంపిణీ