News January 27, 2025

సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మిడియట్ పరీక్షలు రాసేవారు 9,310

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 5,065 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4,245 మంది సెకండ్ విద్యార్థులు మొత్తం కలిపి 9,310 మంది పరీక్షలు రాస్తారని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Similar News

News March 14, 2025

రాజమండ్రి: శక్తి యాప్‌ను ప్రతి మహిళ రిజిస్టర్ చేసుకోవాలి: ఎస్పీ

image

ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్‌ను ప్రతి మహిళ నిక్షిప్తం చేసుకొని ఆపద సమయంలో పోలీసులు నుంచి సహాయం పొందాలని జిల్లా ఎస్పీ టి.నరసింహ కిషోర్ తెలిపారు. శక్తి యాప్ డౌన్లోడ్, ఇన్స్టాలేషన్, ఫీచర్లపై జిల్లా టెక్నికల్ టీంతో ఆయన గురువారం సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే అత్యాచారాలు, వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి వాటిని నివారించడానికి శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

News March 14, 2025

అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలలో అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.

News March 14, 2025

JNGM: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

జనగామలో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

error: Content is protected !!