News March 26, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎక్కువైన ఎండ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండ ఎక్కువైందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రోజు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 39.0°c, కోనరావుపేట 38.9°c, రుద్రంగి 38.5°c, సిరిసిల్ల 38.4°c, °c,తంగళ్ళపల్లి తంగళ్లపల్లి 37.8°c, వేములవాడ 37.2°c, ఎల్లారెడ్డిపేట 37.2°c,లుగా నమోదు అయ్యాయి. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు సూచనలు జాగ్రత్తగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News April 1, 2025
వైద్యం వ్యాపారంలా మారింది: మంత్రి సత్యకుమార్

AP: వైద్యవృత్తి విలువలు నేడు పలుచబడ్డాయని వైద్యమంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వైద్యుల్ని ప్రజలు దేవుళ్లుగా చూస్తారు. కానీ నేడు వైద్యం వ్యాపారంగా మారింది. అవసరం లేని పరీక్షల్ని చేయిస్తున్నారు. సహజ ప్రసవాల్ని తగ్గించేశారు. రోగుల్ని వైద్యులు చిరునవ్వుతో పలకరించాలి. నైతిక విలువల్ని పాటించాలి’ అని సూచించారు.
News April 1, 2025
సోమందేపల్లిలో ఘర్షణ.. ఒకరి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సాయినగర్‌లో మంగళవారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అప్పు వ్యవహారంలో బావ మారి, బావమరిది నారాయణ ఘర్షణకు దిగారు. మారీ కర్రతో దాడి చేయడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘర్షణలో మృతుడు నారాయణ అన్న అంజికి గాయాలలైనట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
News April 1, 2025
సంబేపల్లి: మామిడి తోటకు నిప్పు

గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ఆకతాయి పనులకు ఓ రైతు తీవ్రంగా నష్టపోయాడు. మండలంలోని దేవళంపేటకు చెందిన షేక్ ఖాదర్ బాషా తన పొలంలో 80 మామిడి చెట్లను నాటి సంరక్షిస్తున్నాడు. ఈక్రమంలో తోట పక్కనున్న కళ్లకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు తోటలోకి చొరబడి పిందె దశలోని 50 చెట్లు కాలిపోయాయి. రైతు తీవ్రంగా నష్టపోయాడు.