News February 8, 2025
సిరిసిల్ల: ట్రాక్టర్‌లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738979337619_1259-normal-WIFI.webp)
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్‌లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.
Similar News
News February 8, 2025
ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వాలంటీర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738996612634_1221-normal-WIFI.webp)
ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంచలనం నమోదైంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను మొదటి ప్రాధాన్యత ఓటుకు గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్‌ని అభ్యర్థిస్తున్నాడు. నామినేషన్లు పూర్తయ్యేలోగా ఇంకా ఎన్ని సంచలానాలను నమోదు అవుతాయో చూడాలి.
News February 8, 2025
మస్తాన్‌సాయి కేసులో ఏపీ అధికారి వీడియోలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738969515900_695-normal-WIFI.webp)
మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రైవేట్ <<15374455>>వీడియోల<<>> కేసులో ఓ AP అధికారి లీలలు బయటికొచ్చాయి. అడిషనల్ SP స్థాయిలో పనిచేసిన ఆయన ఓ యువతితో ఉన్న ఫొటోలు, చాటింగ్ దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ కేసు విషయంలో వారిమధ్య ఏర్పడిన పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లినట్లు సమాచారం. తర్వాత ఆయన మోసం చేశాడంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతికి సాయం చేసిన శేఖర్ బాషా ఆ వీడియోలను తీసుకున్నట్లు తెలుస్తోంది.
News February 8, 2025
ఓటమి దిశగా సీఎం ఆతిశీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738994966021_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్‌లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజ్రీవాల్‌పైనా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ ఆధిక్యంలో ఉన్నారు.