News February 7, 2025

సిరిసిల్ల: డైరీ, టెక్స్‌టైల్ ఎగుమతులు పెంచాలి: కలెక్టర్

image

డైరీ, టెక్స్ టైల్ రంగాల్లో ఎగుమతుల పెంపునకు కృషిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ లెవెల్ ఎకోస్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ) సమావేశం నిర్వహించారు.

Similar News

News February 7, 2025

KMR: BC డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారు: జీవన్ రెడ్డి

image

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌ను స్థానిక ఎన్నికల్లో నిలదీయాలని ఆర్మూర్ BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. NZB పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కామాను చెరిపేసి ఫుల్ స్టాఫ్ ఎందుకు పెట్టారో బీసీ కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరులో కాంగ్రెస్ జీరో కావడం ఖాయమన్నారు.

News February 7, 2025

జగన్ మరీ దిగజారిపోయారు: షర్మిల

image

AP: మాజీ సీఎం మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. క్యారెక్టర్ ఏంటో ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ‘వైఎస్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా విజయసాయిరెడ్డితో నా క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారు. వైఎస్ కోరికలకు విరుద్ధంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి తీసుకువచ్చి చెప్పించారు. ఇదీ జగన్ మహోన్నత వ్యక్తిత్వం’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News February 7, 2025

ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం

image

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

error: Content is protected !!