News April 3, 2025
సిరిసిల్ల: పది పరీక్షలు ప్రశాంతం

సిరిసిల్ల జిల్లాలో ఒకేషనల్ పదవ తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని సిరిసిల్ల డీఈవో జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం జిల్లాలో 979 మంది విద్యార్థులకూ 977 మంది విద్యార్థులు హాజరయ్యారని స్పష్టం చేశారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం విద్యార్థుల హాజరు శాతం 99.80గా నమోదయిందని తెలిపారు.
Similar News
News April 10, 2025
అందాల పోటీల ఏర్పాట్లను పరిశీలించిన స్మిత సబర్వాల్

తెలంగాణ పర్యాటక కార్యదర్శి స్మిత సబర్వాల్ HYDలోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శించి, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఈ కార్యక్రమం హైలైట్ చేసేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరో నెలలో మిస్ వరల్డ్- 2025 72వ ఎడిషన్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది.
News April 10, 2025
కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి

గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వడ్డెర కుటుంబానికి చెందిన లక్ష్మి(45) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం కేసరపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
News April 10, 2025
HYD: నేడు HCUకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నేడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ HYDకు రానుంది. ఈ బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర ప్రభుత్వాధికారులు, న్యాయ పర్యావరణవేత్తలు, ఆయా రంగాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈనెల 11వ తేదీలోగా ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సి ఉంది.