News March 27, 2025

సిరిసిల్ల: ‘ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టవద్దు’

image

ప్రజావాణిలో వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని ప్రజా భవన్ నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు. ప్రజా భవన్ ప్రజావాణి దరఖాస్తులు, ఎన్ బీఎఫ్ఎస్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు.

Similar News

News April 1, 2025

బుక్కపట్నం: డైట్ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తూ.. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ కలిగిన స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 10 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News April 1, 2025

గద్వాల: ‘కుల వివక్షను రూపుమాపేందుకు పోరాటం చేద్దాం’

image

కుల వివక్షను రూపుమాపేందుకు KVPS ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలో జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పూలే, అంబేడ్కర్ స్ఫూర్తితో కుల వివక్షపై ప్రతిఘటన పోరాటాలు చేయాలన్నారు. కులం పేరుతో దూషించడం చట్టరీత్యా నేరమని అందరికీ తెలియజేయాలన్నారు.

News April 1, 2025

భార్యకు పెళ్లి చేసిన భర్త.. ఊహించని మలుపు

image

UP: భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి <<15898025>>పెళ్లి చేసిన ఘటనలో<<>> సినిమా లెవల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు వికాస్‌‌తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ చెంతకు చేరింది. భార్యకు దూరమై పిల్లలిద్దరి బాధ్యత చూసుకుంటూ బబ్లూ అనుభవించే బాధ గురించి వికాస్ తల్లి తన కొడుక్కి అర్థమయ్యేలా చెప్పింది. దీంతో వికాస్ రాధికను తిరిగి బబ్లూ వద్దకు పంపాడు. తన భార్యను స్వీకరిస్తానని బబ్లూ పంచాయతీలో ఒప్పుకున్నాడు.

error: Content is protected !!