News March 17, 2025

సిరిసిల్ల: ప్రజావాణిలో 113 దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను SRCL కలెక్టర్, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో 113 దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు.

Similar News

News March 18, 2025

బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ 

image

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.

News March 18, 2025

కరీంనగర్: బాలికలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి

image

తిమ్మాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో పాటు భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు.

News March 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!