News March 17, 2025
సిరిసిల్ల: బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే: ఎస్పీ

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్లజిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల 18 ఫిర్యాదులను స్వీకరించారు.
Similar News
News March 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,500లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,000కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది. శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
News March 18, 2025
తిరుపతిలో ధర్నా.. బీసీవై పార్టీ చీఫ్‌పై కేసు

AP: తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా <<15787478>>సాధువులతో కలిసి ధర్నా<<>> చేసిన బీసీవై(భారత చైతన్య యువజన) పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్‌పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయనతో సహా మరో 19 మందిపై FIR నమోదైంది.
News March 18, 2025
NZSR: హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపికైన వెన్నెల

టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన కొర్ర వెన్నెల ఎంపికయ్యింది. రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలో మహిళా విభాగంలో వెన్నెల 180/300 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. ఈసందర్భంగా వెన్నెలను తండావాసులు అభినందించారు.