News February 6, 2025
సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..
స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 6, 2025
ఇతను నిజమైన మృత్యుంజయుడు!
ఏడుసార్లు మరణం నుంచి బయటపడిన ‘వరల్డ్ లక్కీయెస్ట్ పర్సన్’ ఫ్రాన్ సెలాక్ జీవితం థ్రిల్లర్ మూవీ కంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తొలుత రైలు నదిలో పడిపోతే ఈయన తప్ప అందరూ చనిపోయారు. ఫ్లైట్‌లో వెళ్తుంటే డోర్స్ ఓపెన్ అవడంతో సెలాక్ గడ్డివాముపై పడి బతికారు. పలు మార్లు భారీ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. కానీ, అతను చనిపోలేదు. 2003లో రూ.7 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. 2016లో 87 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో చనిపోయారు.
News February 6, 2025
మళ్లీ మొరాయించిన చాట్ జీపీటీ
ఏఐ చాట్ బోట్ జీపీటీ మరోసారి మొరాయించింది. తమకు ఆ యాప్ యాక్సెస్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా చాట్ జీపీటీ ఇదే తరహాలో ఆగిపోవడం గమనార్హం. సమస్యపై సంస్థ స్పందించింది. ఏఐ మోడల్‌లో స్వల్ప ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, చక్కదిద్దేందుకు ట్రై చేస్తున్నామని వివరణ ఇచ్చింది.
News February 6, 2025
జమిలి ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
AP: రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని YS జగన్ దుయ్యబట్టారు. ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పా. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.