News February 26, 2025
సిరిసిల్ల: ‘యముడు పిలుస్తున్నాడు.. నేను చనిపోతున్నా’

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మంజుల, బాలమల్లు దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్(19) HYDలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి ఫోన్ చేసి తనకు చదువు ఇష్టం లేదని చెప్పాడు. మంగళవారం ‘అమ్మానాన్న సారీ.. నన్ను యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా బై..బై..’అంటూ సూసైడ్ నోట్ రాసి HYD కాచిగూడలో ట్రైన్ కిందపడి చనిపోయాడు.
Similar News
News February 26, 2025
మచిలీపట్నం: రామలింగేశ్వరుడిని దర్శించుకున్న కలెక్టర్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి మచిలీపట్నం రాబర్ట్ సన్ పేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News February 26, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 15 మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెలవును ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ఆయన చెప్పారు.
News February 26, 2025
విశాఖ జూలో అబ్బుర పరుస్తున్న సెల్ఫీ పాయింట్స్

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెల్లటైగర్ ఎన్ క్లోజర్, జిరాఫీ ఎన్ క్లోజర్, బటర్ ఫ్లై పార్కుతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో వీటిని ఏర్పాట చేశారు. కలర్ ఫుల్‌గా వివిధ హంగులతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద సందర్శకులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. పాయింట్లు మరిన్ని పెంచాలని కోరుతున్నారు.