News April 22, 2025
సిరిసిల్ల: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలి

యాసంగి పంట కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిలజిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
Similar News
News April 23, 2025
HYD: తెలంగాణ పోలీస్ క్రీడాకారులకు 18 పతకాలు

కొచ్చిలో జరిగిన తొలి అఖిల భారత పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్ టోర్నీలో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ చూపారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీపడి12 మంది అధికారులు మొత్తం 18 పతకాలు గెలుచుకున్నారు. వాటిలో 2 బంగారు, 2 వెండి, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరిని డీజీపీ జితేందర్ అభినందించారు. ఈ విజయం పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు.
News April 23, 2025
నిర్మల్: పేదింటి అమ్మాయిలకు స్టేట్ ర్యాంకులు

పేద కుటుంబాల నుంచి వచ్చి గురుకులాల్లో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు నిర్మల్ అమ్మాయిలు. శాంతినగర్ గురుకుల బాలికల కళాశాలల ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో అక్షయ 435, విజయలక్ష్మి, కీర్తన 433, వైష్ణవి 432 మార్కులు సాధించారు. ఎంపీసీలో శార్వాణి, శ్రీవల్లి 465, సంధ్యారాణి, వర్షిని 464, కీర్తన 463 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని కొనియాడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
News April 23, 2025
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజు

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే.రాజును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే కేకే.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందరు.