News March 18, 2025
సిరిసిల్ల: హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన దార్ల జయ సోమవారం ప్రకటించిన హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో రాజన్న జోన్‌లో 4వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం చందుర్తి మండలంలో కేజీబీవీలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే ఖాళీ సమయంలో డీఎస్సీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఫలితాల్లో సత్తా చాటింది. దార్ల లింగం, దేవా దంపతులు వ్యవసాయ కూలీ పని చేస్తు కుమార్తెను చదించారు.
Similar News
News March 18, 2025
జనగామ: టెన్త్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జనగామ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పింకేశ్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్ పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
News March 18, 2025
కామారెడ్డి కలెక్టరేట్‌కు మళ్లీ రప్పించారు

కామారెడ్డి జిల్లాలో 15మంది తహసిల్దార్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బదిలీల్లో ప్రేమ్ కుమార్‌ను అధికారులు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఇంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే ప్రేమ్ కుమార్ డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి డీఎఓగా పంపగా మళ్లీ అతనినీ అధికారులు కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.
News March 18, 2025
మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్‌వో

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.