News March 22, 2024
సిరిసిల్లలో మహిళ దారుణ హత్య

సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అనంత నగర్‌కు చెందిన మహిళను ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో నిందితుల ఆధార్ కార్డులు, మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరిరంచి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 21, 2025
కరీంనగర్: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి: బండి

భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతోపాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.
News April 21, 2025
వీణవంక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాద్‌లో ఇవాళ ఆటో, బైక్ <<16165881>>ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. అయితే ఆటో, బైక్ ఢీ కొనడంతో కరీంనగర్‌కు చెందిన పేపర్ ఆటో నడిపే నాగరాజు మృతి చెందగా, బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 21, 2025
కరీంనగర్: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో కరీంనగర్ జిల్లాలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281.