News February 24, 2025
సిర్పూర్ టీ: భీమన్న గుడి వద్ద మృతదేహం

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమన్న దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని సిర్పూర్ పోలీసులకు అందించారు. అయితే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్‌పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.
News February 24, 2025
అసెంబ్లీ సమావేశాలు.. ఆంక్షల విధింపు

AP: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో నినాదాలు చేయడం, ప్లకార్డుల ప్రదర్శన, కరపత్రాల పంపిణీకి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. పరిసరాల్లో సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇతరులకు ప్రవేశం లేదు, సభ్యుల పీఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్‌లు రద్దు చేశారు.
News February 24, 2025
NZB: కాంగ్రెస్‌కు షాక్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసి అభ్యర్థిగా నామినేషన్ వేసి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మధనం గంగాధర్ సీఎం పర్యటనకు ముందు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.