News March 18, 2025

సిర్పూర్(యు): గంజాయి సాగు.. మూడేళ్ల జైలు

image

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని మధుర తండాకు చెందిన కట్కవార్ రావు సింగ్ 24/10/2021న పొలంలో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. కేసు విచారణలో భాగంగా సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ సదరు వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.

Similar News

News March 18, 2025

BREAKING: కర్నూలు జిల్లాలో 11 మంది SIల బదిలీ

image

☛ బాల నరసింహులు హొళగుంద నుంచి కర్నూలు త్రీటౌన్
☛ హనుమంత రెడ్డి VR TO కోసిగి
☛ చంద్రమోహన్‌ కోసిగి TO కర్నూలు 3టౌన్‌
☛ కేశవ కొత్తపల్లి TO నందవరం
☛ శ్రీనివాసులు నందవరం TO DCRB కర్నూలు
☛ రమేశ్ బాబు VR TO కర్నూలు 1టౌన్
☛ మన్మథ విజయ్‌ కర్నూలు 3టౌన్‌ TO ఆస్పరి
☛ మల్లికార్జున DSO నుంచి జొన్నగిరి
☛ జయశేఖర్‌ జొన్నగిరి నుంచి ఆదోని 3టౌన్
☛ దిలీప్ కుమార్ ఆలూరు నుంచి హోళగుంద
☛ మహబూబ్ బాషా హోళగుంద నుంచి ఆలూరు

News March 18, 2025

ఇచ్ఛాపురం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

image

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు IlT, JAM ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఈ మేరకు మంగళవారం విడుదలైన ఆల్ ఇండియా IIT JAM, MSc కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బాకేశ్వరి 467, గుడియా జ్యోతి 786, బి.పూజిత 1333 ర్యాంకులు సాధించారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపల్ డా.రబిన్ కుమార్ పాడి ద్వారా కెమిస్ట్రీ లెక్చరర్ శివకుమార్ విద్యార్థులకు రూ.12 వేల నగదు బహుమతి అందించారు.

News March 18, 2025

RTC ఎండీ సజ్జనార్ క్రేజ్ ఇప్పుడు ఇంటన్నేషనల్

image

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Say no to betting apps #Tag తర్వాత దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మీరు చెప్పేది నిజమే సర్ అంటూ లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. సజ్జనార్ ఇన్‌స్టాను 65 లక్షల మంది చూడగా X హ్యాండిల్‌ను 72 లక్షల మంది చూశారు. విదేశాల్లో మొరాకో, యూఎస్, యూఏఈ, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ దేశాల వాసుల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.

error: Content is protected !!