News April 5, 2025

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం

image

ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, CS కె. విజయానంద్, CRDA కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజధాని పనులలో పురోగతి, అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ హాజరు కానున్నందున కార్యక్రమ సన్నాహకాల గురించి చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 

Similar News

News April 7, 2025

ఉత్తరాదికి నిధులు.. దక్షిణాదికి మోసం: కోదండరాం

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని MLC కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. HYDలో ఈ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. పన్ను వసూళ్లలో మనమే ఎక్కువ చెల్లిస్తున్నామని వివరించారు. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, దక్షిణాదిని కేంద్రం మోసం చేస్తోందన్నారు.

News April 7, 2025

చిత్తూరు: ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

image

చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయ లక్ష్మి, అనుపమ, కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు.

News April 7, 2025

బాటసింగారానికి భారీగా వస్తున్న మామిడికాయలు

image

బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌కి భారీగా మామిడికాయలు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి మామిడికాయల లారీలు పోటెత్తుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున మామిడికాయలు రావడంతో సీజన్ చివరి వరకు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఒక్కరోజే 300 ట్రక్కుల్లో సుమారు 7వేల టన్నుల పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!