News September 29, 2024

సీఎం చంద్రబాబుతో సిద్దార్థనాథ్ సింగ్ భేటీ

image

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత సిద్దార్థనాథ్ సింగ్ శనివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గత 100 రోజులుగా రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి సీఎంతో చర్చించానని సిద్దార్థనాథ్ సింగ్ ట్విట్టర్(X)లో పోస్ట్ చేశారు.

Similar News

News December 21, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 21, 2024

గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన CM చంద్రబాబు

image

కృష్ణా జిల్లా పెనమలూరులో సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అభిమానులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పెనమలూరుకు చెందిన ఓ అభిమాని కోరిక మేరకు ఆయన గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దీంతో ఆ అభిమానికి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుతో నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సెల్ఫీలు దిగారు. 

News December 21, 2024

విజయవాడలో కొత్త యాప్ తెస్తున్నాం: కలెక్టర్

image

అంత‌వ‌ర‌కు స‌ర‌దా స‌ర‌దాగా గ‌డిపిన ఆ కుటుంబంలో ఒక్క‌సారిగా పెద్ద అల‌జ‌డి.. త‌మతో పాటు ఉన్న చిన్నారి అక‌స్మాత్తుగా క‌నిపించ‌క‌పోయే స‌రికి అంతులేని ఆవేద‌న. తప్పిపోయిన చిన్నారులను కనిపెట్టే సీఎంఎస్ యాప్‌ను NTR జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి లక్ష్మీశా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలో డిసెంబర్ 21 నుంచి 25 వరకు జరిగే భవాని విరమణ దీక్షల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.