News March 16, 2025
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైబల్ యూనివర్శిటీ వీసీ

సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్. శ్రీనివాస్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీనివాస్ శాలువాతో సన్మానించి సత్కరించారు. మొట్టమొదటి, నూతన వీసీగా నియామకమైన శ్రీనివాస్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.
Similar News
News December 20, 2025
HYD: సూర్యుడొచ్చినా చుక్కలు చూపిస్తున్న చలి

HYD శివారు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. సూర్యుడు ఉదయించినా కనిష్ఠ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటంతో జనజీవనం గడ్డకట్టుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు చలితో గజగజ వణుకుతున్నారు. ఉ.9 దాటినా స్వెటర్లు, క్యాపులతోనే ప్రజలు కనిపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు చలిగాలులకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి చలి తీవ్రత అసాధారణమని ప్రజలు వాపోతున్నారు. మీ ఏరియాలో చలి ఎలా ఉంది?
News December 20, 2025
హైదరాబాద్‌లో పండగ షురూ

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు కొనసాగనున్న పుస్తకాల పండుగలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మొత్తం ఇందులో 350 స్టాళ్లు కొలువుదీరాయి. రోజూ మ.12 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది. మొదటి రోజే పుస్తక ప్రియులతో స్టేడియంలో సందడి నెలకొంది.
News December 20, 2025
హైదరాబాద్ రోడ్లకు ‘బాహుబలి’ స్కానింగ్

మన సిటీ రోడ్ల తలరాత మారబోతోంది బాస్!.. గుంతలు పడ్డాక గోతులు పూడ్చడం కాదు.. అసలు రోడ్డు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఒక సూపర్ ప్లాన్ వేసింది. 3,805 లేన్ KMs మేర హైటెక్ మెషీన్లతో Advanced 3D Network Survey Vehicles, Ground Penetrating Radarతో తనిఖీలు మొదలుపెట్టనుంది. రోడ్డుపైకి నీట్‌గా ఉన్నా లోపల ఎక్కడ పగుళ్లు ఉన్నాయో? ఈ ‘ఎక్స్‌రే’ మిషన్లు గుర్తిస్తాయి.


