News February 1, 2025
సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్: జగ్గారెడ్డి
సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మారాడని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి హైదరాబాదులోని గాంధీభవన్లో ఖండించారు. రియల్ ఎస్టేట్ కొంపముంచింది కేసీఆరేనని విమర్శించారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్‌ను కేసీఆర్ నాశనం చేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 1, 2025
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ‘పుష్ప 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. టాప్-10 మూవీస్‌లో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీ గత నెల 30న ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1,900 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
News February 1, 2025
Stock Markets: రైల్వే, డిఫెన్స్ షేర్లపై ఫోకస్
దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో మొదలై రేంజుబౌండ్లో కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ 97 పాయింట్ల మేర నష్టపోవడం దీనినే సూచిస్తోంది. బడ్జెట్ మొదలయ్యాక సెంటిమెంటును బట్టి ఎటువైపైనా స్వింగ్ అవ్వొచ్చు. వృద్ధి, వినియోగం, ఇన్ఫ్రా, SMEలపై ఫోకస్ నేపథ్యంలో రైల్వే, డిఫెన్స్, బ్యాంక్స్, PSE షేర్లపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ కావడంతో శనివారమైనా స్టాక్‌మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.
News February 1, 2025
జగిత్యాల: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి
మెట్‌పల్లి చింతల్‌పెట శివారులో శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇబ్రహీంపట్నం వేములకుర్తికి చెందిన బర్మా నగేశ్(32) మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చింతల్‌పేట-వేములకుర్తికి వెళ్తున్న నగేశ్.. మెట్‌పల్లి-యూసుఫ్‌నగర్‌కు వస్తున్న సోఫియాన్ బైకులు చింతలపేట శివారులో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నగేశ్ అక్కడికక్కడే మృతి చెందగా సోఫియాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.