News April 3, 2025
సీడ్స్ సంస్థను సందర్శించిన జిల్లా కలెక్టర్

దుత్తలూరులోని సీడ్స్ ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, కంటి పరీక్షలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ సంస్థ సేవలందిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 10, 2025
నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపట్టపుపాళెంలో దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వరకట్నం కోసం సుగుణమ్మను వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి చేశారు. ఈ విషయం బయటకొస్తుందని ఆపై కొట్టి చంపేశారు. కళ్లాపి రంగు తాగి ఆత్మహత్య చేసుకుందని హైడ్రామా సృష్టించారు. భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 10, 2025
NLR: నోషనల్ ఖాతాలుగా మార్చేందుకు చర్యలు

నెల్లూరు జిల్లాలో భూముల నోషనల్ ఖాతాలను మార్పు చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఆర్వో ఉదయ భాస్కర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భూముల్లో రైతులకు సంబంధించిన రికార్డుల్లో నోషనల్ ఖాతాల నమోదు, వివాదాలు లేని పట్టా భూములకు రెగ్యులర్ నోషనల్ ఖాతా ఇవ్వడానికి ఈనెల 16వ తేదీలోగా తహశీల్దార్, ఆర్డీవోలకు తగిన రికార్డులు సమర్పించాలని సూచించారు.
News April 10, 2025
గుంటూరులో నెల్లూరు మహిళపై దాడి

గుంటూరులో నెల్లూరుకు చెందిన మహిళపై దాడి జరిగింది. అక్కడి RTC బస్టాండ్ వద్ద నెల్లూరు మహిళ వ్యభిచారం చేస్తోంది. ఆమెతో బేరం మాట్లాడుకున్న ఓ వ్యక్తి గుంటూరు మణిపురం బ్రిడ్జి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడి చేశారు. రూ.1000 లాక్కొని పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు.