News March 7, 2025
సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.
Similar News
News March 9, 2025
విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.
News March 9, 2025
నల్గొండ: తండ్రి అంతిమ సంస్కారాలు చేసిన కుమార్తె

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ జనశక్తి సీనియర్ నాయకులు చిట్టూరి సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమార్తె తెలంగాణ ఉద్యమ సారథి కళాకారిణి పల్స నిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమయ్యకు ఒక్కరే సంతానం కావడంతో అన్నీ తానై తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్కతో పాటు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమయ్య మృతితో నకిరేకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 9, 2025
ప్రయాగ్‌రాజ్‌లో నీరు చక్కగా ఉంది: కాలుష్య నియంత్రణ బోర్డు

కోటానుకోట్ల మంది ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు. అక్కడి నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. గంగ, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని, స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. కుంభమేళా టైమ్‌లో సంగమం వద్ద నీటి నాణ్యతపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.