News March 28, 2025
సీతంపేట : మంచంపై నుంచి పడి విద్యార్థి మృతి

సీతంపేట మండలం దోనుబై ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చలపతి శుక్రవారం మృతి చెందాడు. హాస్టల్‌లో తన బెడ్ నుంచి కిందికి దిగేప్పుడు కాలు జారిపడ్డాడు. ప్రమాదంలో చెవి భాగం వైపు గట్టిగా తగలటం వలన రక్తం రావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తన తోటి స్నేహితులు చెప్తున్నారు. దోనుబై S.I ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిది కారెంకాగుమానుగడుగా సమాచారం.
Similar News
News April 2, 2025
అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. నాగర్‌కర్నూల్‌లో ఆందోళన

ఊర్కొండపేటలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ..అక్కడ ఒక గ్యాంగ్ మాటు వేసుకుని ఉందంటే ఈ తతంగం ఇప్పటికిప్పుడు జరిగిందేమీ కాదని, కొంతమంది సహకారం లేకపోతే ఇలాంటి క్రూర, దుర్మార్గమైన ఘటనలు జరగవన్నారు.
News April 2, 2025
రాయపర్తి: ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించండి: ఎమ్మెల్యే

రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం అందేలా నిరంతరం పనిచేస్తున్నామని, ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
News April 2, 2025
నాగర్ కర్నూల్: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

ఆకతాయిల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా పోలీస్ షీటీమ్స్‌ను సంప్రదించి వేధింపుల నుంచి విముక్తి పొందాలని యువతులకు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ కోసం పోలీస్, షీ టీం బృందాలు పర్యటిస్తూ బస్టాండ్లు, విద్యాసంస్థలు, గ్రామ స్టేజీల్లో నిఘా ఉంచుతామని, మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యమన్నారు.