News March 1, 2025
సీతంపేటలో పర్యటించిన కలెక్టర్

సీతంపేటలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా జరుగుతున్న జీడీ ప్రాసెసింగ్, అగరబత్తుల తయారీ విధానాన్ని పరిశీలించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పట్టు పరిశ్రమ యూనిట్‌ను సందర్శించారు. సీతంపేట ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.
Similar News
News March 2, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 2, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 2, 2025
MDCL: ఆరెంజ్ ALERT.. ఆ రోజు జాగ్రత్త.!

MDCL జిల్లాలోని ఉప్పల్, మేడిపల్లి, కాప్రా, కీసర, ఘట్కేసర్, మూడు చింతలపల్లి, బాలానగర్, అల్వాల్, శామీర్పేట మండలాలకు TGDPS ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడాన్ని గమనించిన TGDPS, జిల్లాలోనిపై ప్రాంతాల్లో మార్చి 3న ఎల్లుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ రోజు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 2, 2025
ఖమ్మం: కానిస్టేబుల్‌ను అభినందించిన సీపీ

టాటా అల్ట్రా మారథాన్ 50 కిలోమీటర్ల రన్‌లో మెడల్ సాధించిన కానిస్టేబుల్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం అభినందించారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడ మారథాన్ నిర్వహించినా పాల్గొంటూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తున్నట్లు ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి రాజు తెలిపారు. గత నెల 23న పూణె సమీపంలోని లోనావాలా సయ్యాద్రి కొండలల్లో మారథాన్ రన్ 50 కిలోమీటర్లను 6గంటల 39 నిమిషాల్లో పూర్తి చేశారని చెప్పారు.