News April 5, 2025
సీతమ్మ తల్లికి సిరిసిల్ల నుంచి బంగారు పట్టు చీర

భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణానికి ఒక భక్తుడు బంగారంతో తయారుచేసిన పట్టుచీరను కానుకగా సమర్పించారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ గత మూడేళ్లుగా సీతమ్మ తల్లికి కళ్యాణం రోజు పట్టుచీర తయారుచేసి సమర్పిస్తున్నారు. ఈసారి రూ.35 వేల విలువగల బంగారు పట్టుచీరను తయారుచేసి భద్రాచలంలో సమర్పించారు. చీరపై సీతారాముల విగ్రహాలను చిత్రీకరించినట్లు తెలిపారు.
Similar News
News April 7, 2025
యాక్షన్ థ్రిల్లర్‌గా ‘స్పిరిట్’!

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం మెక్సికోలో స్టార్ట్ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ‘స్పిరిట్ సినిమా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగే ప్రాజెక్టు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఇది సాలిడ్ యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ టైప్ సినిమా అని తెలియడంతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.
News April 7, 2025
మంథనిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి

మంథని మండలంలో నిన్న వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. మంథని మండలం భట్టుపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గడి రవి(45) అనే వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన దుర్కి కొమురయ్య(45) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News April 7, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} నేడు భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం ∆} ఖమ్మం జిల్లాలో గవర్నర్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లి లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} కూసుమంచి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం