News March 17, 2025
సీతానగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సీతానగరం మండలం జగ్గు నాయుడుపేట సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తాంబరం నుంచి చక్రధరపూర్ వెళ్తున్న రైలు నుంచి ప్రధాన్ హం బోరో (23) జారి పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విజయనగరం తరలించామన్నారు.
Similar News
News March 18, 2025
కాకినాడ: భర్త వేధింపులు.. కుటుంబాన్ని పోషించలేక సూసైడ్

కాకినాడలో నిన్న స్వాతి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఉన్న సూసైడ్ నోట్, సెల్ఫీవీడియో ద్వారా తెలిసింది. స్వాతి(26), సురేష్లది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. సురేష్ డ్రైవర్గా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. స్వాతి తెచ్చిన జీతం తీసుకొని తాగేసి గొడవ పడేవాడు. ఇలా అయితే పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెంది సూసైడ్ చేసుకుంది.
News March 18, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఫాల్గుణ మాసం మంగళవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
News March 18, 2025
త్రేతాయుగం నాటి ఆలయం.. మీరు వెళ్లారా..!

హీరో నితిన్ అశ్వారావుపేట సరిహద్దులో ఉన్న గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని స్థానికులు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందిందని అంటున్నారు. గిరిపుత్రులే పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయానికి అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా వెళ్లొచ్చు.