News November 29, 2024
సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
జిల్లాలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి 4 వారాలు మాత్రమే సమయం ఉందని, నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. 1,026 సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 255 రోడ్లు పూర్తి అయ్యాయని, మిగిలిన 771 సీసీ రోడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News November 29, 2024
నంద్యాలలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏర్పాటు
నంద్యాలలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 48 చోట్ల ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్మించేందుకు ప్రాంతాలను గుర్తించారు. అందులో భాగంగా ఏపీలో నంద్యాల, చింతపల్లి, విజయనగరం ప్రాంతాలను గుర్తించారు. నంద్యాలలో ఎక్కడ ఏర్పాటయ్యేది త్వరలోనే తెలియనుంది.
News November 29, 2024
బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ
ప్రాపర్టీ కేసులు, సైబర్ నేరాల కేసులలో బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
News November 28, 2024
తుంగభద్ర తీరంలో మొసలి కలకలం
తుంగభద్ర నది తీరంలో మొసలి కలకలం లేపింది. కౌతాళం మండలం గుడి కంబాలి సమీపంలో గురువారం తుంగభద్ర నది ఒడ్డున పెద్ద మొసలి పొలాల వైపు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఏడాదిలో తుంగభద్ర నది తీరంలోని అనేక గ్రామాల పంట పొలాలలో మొసళ్లు కంటబడుతున్నాయి. నది చాగీ, కుమ్మలనూరు, మురళి గ్రామాల సమీపంలో 2 నెలల నుంచి మొసళ్లు సంచరిస్తూనే ఉన్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.