News March 25, 2025

సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా బోధన్ MLAకు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కాగా MLC మహేశ్ కుమార్ గౌడ్‌కు PCC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే BSWDకి చెందిన కాసుల బాల్‌రాజ్‌‌కు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమించింది. బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌కు టీజీఎండీసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవీ దక్కలేదు. జిల్లాకు అమాత్య యోగముందా కామెంట్ చేయండి.

Similar News

News March 29, 2025

NZB: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో మృతి చెందినపై ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ 1వ టౌన్ SHO రఘుపతి కోరారు. ఇతను నెహ్రు పార్క్ ఏరియా దగ్గర ఉన్న లేబర్ అడ్డా దగ్గర నుంచి పనికి వెళ్తు ఉంటాడన్నారు. శుక్రవారం ఖలీల్వాడి, నిజామాబాద్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని చెప్పారు. ఇతడి గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.

News March 29, 2025

NZB: అక్రమంగా విక్రయిస్తున్న రెండు గంజాయి పట్టివేత

image

అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్‌ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.

News March 29, 2025

NZB: కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

image

నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రలో చంద్రకళ(55) అనే మహిళా హత్యకు గురైంది. కూలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన కూతురితో మాట్లాడిన చంద్రకళ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కూతురు రమ్య ఇంటికి వచ్చి చూసే సరికి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!