News April 7, 2025

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుగు ప్రయాణం

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన సంజీవ్ ఖన్యా తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు జ్ఞాపికలను అందజేసి వీడ్కోలు పలికారు. పర్యటనకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News April 17, 2025

సమ్మర్ టూర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను చుట్టేద్దాం..

image

సమ్మర్ HOLIDAYS వచ్చాయంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చాలా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం ఫోర్ట్, పాపికొండలు, పులిగుండాల, లకారం ట్యాంక్‌బండ్, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం, భద్రాచలం రామయ్య గుడి, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్ట్, పాల్వంచ పెద్దమ్మ గుడిని ఒక్క రోజులో చుట్టేయొచ్చు. వీటిలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో కామెంట్ చేయండి

News April 17, 2025

వనపర్తి: బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: చిన్నారెడ్డి

image

రాహుల్ గాంధీకి పెరుగుతోన్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారని, అందుకే అక్రమ కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆరోపించారు. వనపర్తిలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాహుల్ సంకల్పం ముందు మోదీ కుట్రలు పనికిరావని చిన్నారెడ్డి హెచ్చరించారు. రాజేంద్రప్రసాద్ యాదవ్, కదిరే రాములు, గడ్డం వినోద్, అబ్దుల్లా ఉన్నారు.

News April 17, 2025

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,508 పాయింట్లు వృద్ధి చెంది 78,553 వద్ద సెటిల్ అయింది. నిఫ్టీ 414 పాయింట్లు లాభపడి 23,851 వద్ద స్థిరపడింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్ సెక్టార్ల షేర్లు దూసుకెళ్లాయి. ఎటర్నల్, ICICI బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, SBI, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ షేర్లు టాప్‌లో నిలిచాయి.

error: Content is protected !!