News June 22, 2024
సుల్తానాబాద్: వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు
సుల్తానాబాద్ పట్టణంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో బాలికకు తాత వరుసైన పోచాలు(60) ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిన బాలిక తల్లిదండ్రులకు తెలుపగా బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 2, 2025
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్స్‌లో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News January 2, 2025
ఎల్లారెడ్డిపేట: యువకుడిపై ఎలుగుబంటి దాడి
ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుట్టపల్లి చెరువు తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భూక్య నరేశ్ మేకలు కాయడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఓ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరేశ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయం అయింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
News January 2, 2025
కరీంనగర్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
నూతన సంవత్సరం కొందరి జీవితాల్లో విషాదం నింపింది. వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. వివరాలిలా.. బావిలో పడి కూలీ చనిపోగా.. బైక్ అదుపుతప్పి బ్యాంకు ఉద్యోగి మరణించాడు. కరెంట్ షాక్‌తో మహిళ.. గుండెపోటుతో శ్రీనివాస్ రెడ్డి మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గట్టుబాబు.. మరో ప్రమాదంలో రమణకుమార్ చనిపోయారు.