News March 11, 2025

సూప‌ర్ సిక్స్ పేరిట ఓట్ల దండ‌కం – కాకాణి

image

చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట ఓట్లు దండుకొని, ప్రజలను దారుణంగా మోసగించాడని మాజీ మంత్రి కాకాణి విమ‌ర్శ‌లు గుప్పించారు. తోట‌ప‌ల్లిగూడూరులో ఆయ‌న ప‌ర్య‌టించారు. స్థానిక నాయ‌కులు, రైతుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కూటమిపాలన పట్ల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని సాధారణ ఎన్నికలు గానీ, జమిలీ ముందస్తు ఎన్నికల్లో గానీ కూటమికి ఘోర ఓటమి ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Similar News

News March 11, 2025

థాంక్యూ సీఎం సర్ : బీద రవిచంద్ర 

image

శాసనమండలి సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బీద రవిచంద్ర యాదవ్ ధన్యవాదములు తెలియజేశారు. సోమవారం అసెంబ్లీలో నామినేషన్ వేసిన అనంతరం చంద్రబాబు నాయుడుతో రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.  రవిచంద్రకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. 

News March 11, 2025

నెల్లూరు: 12మంది అడ్మిన్లకు షోకాజ్ నోటీసులు జారీ

image

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్ అడ్మిన్ కార్యదర్శులు 12 మందికి రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో కమిషనర్ సూర్య తేజ షోకాజ్ నోటీసులను సోమవారం జారీ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు ఈ నెల చివరి నాటికి కరెంట్ డిమాండ్ 100%, అరియర్ డిమాండ్ 75% పూర్తి చేయాలని నిర్దేశించారని తెలిపారు.

News March 10, 2025

రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

image

ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.

error: Content is protected !!