News March 9, 2025
సూర్యాపేట: ఆ 8 మంది సజీవ సమాధి..?

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Similar News
News March 10, 2025
సంగారెడ్డి: కడుపునొప్పితో వివాహిత సూసైడ్

కడుపునొప్పి భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. SI రంజిత్ రెడ్డి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మం. మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)కి కౌడిపల్లి మం. మహమ్మద్‌నగర్‌కు చెందిన అనిల్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. కొడుకు పుట్టినప్పటి నుంచి మహేశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. పలుచోట్ల చికిత్స చేయించినా తగ్గలేదు. మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంట్లో ఉరేసుకుంది. మహేశ్వరి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News March 10, 2025
KMR: నేడు ప్రజావాణి: జిల్లా కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నేడు (సోమవారం) కలెక్టర్ సమావేశం మందిరం వేదికగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆశిష్ సాంగ్వాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 10, 2025
మెదక్: కడుపునొప్పితో వివాహిత సూసైడ్

కడుపునొప్పి భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. SI రంజిత్ రెడ్డి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)కి కౌడిపల్లి మం. మహమ్మద్‌నగర్‌కు చెందిన అనిల్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. కొడుకు పుట్టినప్పటి నుంచి మహేశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. పలుచోట్ల చికిత్స చేయించినా తగ్గలేదు. మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంట్లో ఉరేసుకుంది. మహేశ్వరి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.