News March 4, 2025
సూర్యాపేట: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ సోమవారం తెలిపారు. జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలలో ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఒక గంట ముందే చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతిలేదన్నారు.
Similar News
News March 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే(పార్ట్-1)

◆ఆలపాటి రాజా(1,45,057)గెలుపు
◆ఉమర్ బాషా షేక్-564
◆కనకం శ్రీనివాసరావు-348
◆అన్నవరపు ఆనంద కిషోర్-860
◆ అరిగల. శివరామ ప్రసాద్ రాజా-579 ◆అహమ్మద్ షేక్-335
◆యమ్మీల వినయ్ కుమార్ తంబి-120
◆కండుల వెంకట రావ్-299
◆గునుకుల వెంకటేశ్వర్లు-34
◆ గుమ్మా శ్రీనివాస్ యాదవ్-522
◆ గౌతుకట్ల అంకమ్మరావు-26
◆గంగోలు శామ్యూల్-321
◆గంట మమత-718
News March 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్నిఓట్లంటే(పార్ట్-2)

◆కె.ఎస్. లక్ష్మణరావు-62,737
◆జూపూడి సామ్ ప్రసాద్-642
◆దారా విక్రమ్-400
◆దీపక్ పులుగు-49
◆దుక్కిపాటి రాధాకృష్ణ-41
◆మురకొండ చంద్రశేఖర్-53
◆యార్లగడ్డ శోభారాణి-95
◆ఎండ్రెడ్డి శివారెడ్డి-108
◆డాక్టర్ రామకోటయ్య మద్దుమల-129
◆లగడపాటి వేణుగోపాల్-210
◆శారదా తిరువీధుల-291
◆సత్య బాల సుందర రామ శర్మ చుండూరు-327
చెల్లని ఓట్లు-26,909
మొత్తం ఓట్లు-2,41,774
News March 4, 2025
జగ్గంపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు వీరే

జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన రౌతుల హర్ష (14), వేణుం మణికంఠ (17) , షేక్ అబ్దుల్లా (17)లు జగ్గంపేట వస్తుందంగా ప్రమాదం జరిగిందని తెలిపారు.