News April 23, 2025
సూర్యాపేట: ఈతకు వెళ్లి బాలుడి మృతి

చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట మండలం గాంధీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ నగర్‌కి చెందిన కిషోర్ కుమార్ (14)తో పాటు అతడి స్నేహితులు చెరువు వద్దకు వెళ్లారు. కిషోర్ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు.
Similar News
News April 23, 2025
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొద్దిసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అరగంటలో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అటు ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడటానికి అవకాశం ఉందని తెలిపారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా?
News April 23, 2025
ఆ కేసును కొట్టేయండి.. కోర్టులో సీఎం రేవంత్ పిటిషన్

TG: తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ CM రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. BJP మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చెప్పారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టొద్దని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రేవంత్ కోరారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
News April 23, 2025
బైసరన్ లోయ ఎంచుకోవడానికి కారణం ఇవేనా?

పహల్‌గామ్‌లోని బైసరన్ లోయను ఉగ్రవాదులు నరమేధానికి ఎంచుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని భద్రతా అధికారులు చెబుతున్నారు.
1. ఇక్కడి పచ్చదనం పాడవ్వకూడదని పహల్‌గామ్- బైసరన్ వరకు 5KM మోటార్ వాహనాలను అనుమతించరు.
2. కాలినడక లేదా గుర్రాల ద్వారానే చేరుకోవాలి.
3. దాడులకు పాల్పడినా ప్రతిచర్యలకు ఆలస్యం అవుతుంది.
4. లోయకున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల సులభంగా చొరబడి దాడి చేసి తప్పించుకోవడానికి వీలుంటుంది.