News March 20, 2025
సూర్యాపేట: త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లు

సూర్యాపేట జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 4,140 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులకు మేలు జరగనుంది. జిల్లాలో ఈ పథకానికి 3,09,062మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News March 21, 2025
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అన్నమయ్య కలెక్టర్

రాయచోటిలోని నేతాజీ సర్కిల్ దగ్గర గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ చామకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీఈఓ, ఆ శాఖ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.
News March 21, 2025
MNCL: పుట్టెడు దుఃఖంలోనూ పది పరీక్ష రాసింది..!

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో పరీక్షాకేంద్రానికి వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని శ్రీలత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తాపూర్‌కు చెందిన మంచర్ల మల్లయ్య(62) గురువారం రాత్రి చనిపోయారు. ఆయన కూతురు శ్రీలత బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసొచ్చింది. దుఃఖంలోనూ పరీక్ష రాసిన ఆమె ఎంతో గ్రేట్ కదా..!
News March 21, 2025
HYD: ఇరుకుగదిలో ‘అంగన్‌వాడీ’

అంగన్‌వాడీ కేంద్రాలు పసిప్రాణాలకు నరకప్రాయంగా మారాయి. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. బహదూర్‌పురా మం.లో అనేక కేంద్రాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. విశాలమైనవి తీసుకోవాలంటే కిరాయి భారం అవుతోంది. ప్రభుత్వం నుంచి అద్దెలు సకాలంలో రాక, టీచర్లు జీతం నుంచే కిరాయి కట్టాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇకనైనా దీనిపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.