News April 6, 2025
సూర్యాపేట: నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్

సూర్యాపేట జిల్లా పరిధిలో నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా మీటింగులు, ర్యాలీలు, ఊరేగింపులను నిర్వహించొద్దని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని తెలిపారు. జిల్లాలో డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News April 9, 2025
HNR మహిళకు మోదీ ప్రశంసా పత్రం

తెలంగాణ నుంచి జిల్లా లీడ్ బ్యాంకులో ముద్ర లోన్ పొంది వ్యాపారంలో రాణించి ఆర్థిక స్వాలంబన సాధించిన హుజూర్‌నగర్ వాసి సృజన సురేష్ రెడ్డికి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసా పత్రం అందజేశారు. ప్రధానమంత్రి ముద్ర యోజన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సృజనను పలువురు అభినందించారు.
News April 9, 2025
అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం చేసుకోలేదని రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నా. కానీ అటు ఆ రిలేషన్‌షిప్‌కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేనని గ్రహించా. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం 15yrs. బహుశా ఆమెకు 18yrs వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో’ అని పేర్కొన్నారు.
News April 9, 2025
బాపట్ల జిల్లా DCHS బాధ్యతల స్వీకరణ

బాపట్ల జిల్లా హాస్పిటల్స్ కోఆర్డినేటర్‌గా మోజేష్ కుమార్ నియమితులయ్యారు. బుధవారం బాపట్ల జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో DCHSగా పనిచేసిన శేషు కుమార్ కృష్ణాజిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన డీసీహెచ్‌గా మోజేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు.