News March 18, 2025
సూర్యాపేట: పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు స్క్వాడ్ విధులు

మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్‌గా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులకి విధులు కేటాయించామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు అందరూ తప్పకుండా పరీక్ష విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వీవీ.అప్పారావు, డీఎంహెచ్‌వో కోటాచలం, డీఈవో అశోక్ ఉన్నారు.
Similar News
News March 18, 2025
మెదక్: ఎండిపోతున్న వరి.. రైతుల ఆందోళన

మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో జిల్లాలో చాలాచోట్ల వరిపంటలు ఎండిపోతున్నాయి. నీరందక చేగుంట మండలం పొలంపల్లిలో వరి ఎండిపోతుంది. దీనికి తోడు ఎండలు సైతం ముదరడంతో వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రామంలో దాదాపు 20 ఎకరాల వరి బీటలు బారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
News March 18, 2025
ఐదు సినిమాలు.. దేనికోసం వెయిటింగ్?

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ఐదు కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా వస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’, హీరో నితిన్ నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’, మోహన్ లాల్ నటిస్తోన్న ‘ఎల్2: ఎంపురాన్’, హీరో విక్రమ్ ‘వీర ధీర శూర’ పార్ట్-2తో పాటు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘సికందర్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇంతకీ మీరు ఏ సినిమాకు వెళ్తారు? కామెంట్ చేయండి.
News March 18, 2025
ఎన్టీఆర్: ఆటల పోటీల్లో పాల్గొనే MLAలు వీరే

మంగళవారం సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగనున్న MLA, MLCల ఆటల పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి పలువురు పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల 100 మీ. పరుగుపందెం పోటీలకు మైలవరం ఎమ్మెల్యే వసంత తన పేరు నమోదు చేసుకోగా, క్రికెట్ మ్యాచ్‌కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం వెలువడింది.