News March 23, 2025
సూర్యాపేట: పది పరీక్షకు 25 మంది ఆబ్సెంట్

సూర్యాపేట జిల్లాలో రెండో రోజు జరిగిన పరీక్షకు 11,901 విద్యార్థులకు గాను 11,876 మంది హాజరుకాగా 25 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపుతున్నామన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Similar News
News March 29, 2025
నర్సాపూర్ (జి): ఓకే గ్రామంలో ఇద్దరు యువకులకు అగ్నివీర్

నర్సాపూర్ జి మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు ప్రభుత్వ కొలువులు వరించాయి. గ్రామానికి చెందిన తోట లక్ష్మణ్, లంబాడి నందకిషోర్ ఇటీవలే విడుదలైన అగ్నివీర్‌లో కొలువులు సాధించారు. ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు ఉద్యోగులు రావడంతో గ్రామస్థులు వారిని అభినందించారు.
News March 29, 2025
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాలకు నీటి కష్టాలు!

మే 15 నుంచి 26 వరకు సరస్వతి నదీ పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాళేశ్వరం వద్ద రూ.25 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. కాగా ఎండ తీవ్రత కారణంగా గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతోంది. పుష్కరాల కోసం ప్రభుత్వం పుష్కరాల కోసం ముందస్తు చర్యల్లో భాగంగా డ్యాం వద్ద సిమెంట్ బ్యాగులతో ఇసుక నింపి దిగువ గోదావరికి అడ్డుగా వేస్తే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది.
News March 29, 2025
ముగిసిన శిథిలాల తొలగింపు

భద్రాచలంలోని ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు శుక్రవారం ముగిసింది. శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు, ఉపేందర్ మృతదేహలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమారు 42గంటల పాటు సహాయక బృందాలు, అధికారులు శిధిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇంటి యజమాని శ్రీపతి దంపతులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.