News February 27, 2025
సూర్యాపేట: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్‌లోని సూర్యాపేట, కోదాడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.
Similar News
News February 27, 2025
పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
News February 27, 2025
వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష

వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. శుక్రవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల కోసం ఉన్నతాధికారులతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. విజయవాడలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన ఆయన పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.
News February 27, 2025
ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎల్లుండి(మార్చి 1) ఓటీటీలోకి రానుంది. సా.6గంటల నుంచి అటు జీతెలుగులో ప్రసారం కానుండగా ఇటు జీ5 యాప్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.