News February 11, 2025
సూర్యాపేట: రిటర్నింగ్ అధికారుల నియామకం

త్వరలో జరగనున్న ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మండలాల వారీగా రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మండలాలకు వివిధ శాఖల విభాగ అధిపతులను ఎంపిక చేశారు. మిగతా సిబ్బంది ఎంపిక జరుగుతోందని తెలిపారు.
Similar News
News December 18, 2025
కుంకుమ సువాసన, రంగు కూడా ఆరోగ్యమే

నుదిటిపై కుంకుమ ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే! అయితే దాని వాసన, రంగుతో కూడా ఆరోగ్యపరంగా మనకెన్నో లాభాలున్నాయని పండితులు చెబుతున్నారు. ‘కుంకుమ సువాసన మన శరీరంలో సానుకూల శక్తిని పెంచుతుంది. దీని ఎరుపు రంగు సంపూర్ణ అగ్ని సూత్రాన్ని సూచిస్తుంది. నుదిటిపై కుంకుమ ధరించడం భౌతిక సుఖాల పట్ల నిర్లిప్తతను పెంచి, అంతిమ చైతన్యం వైపు మనల్ని నడిపించేందుకు సహాయపడుతుంది’ అని అంటున్నారు.
News December 18, 2025
HYD: ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశను మార్చింది

<<18569096>>శ్రీశ్రీ<<>> రచించిన ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశనే మార్చిన సంచలన కవితా సంకలనం. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల ఆవేదన, ఆకలి, నిరుద్యోగంపై గర్జించే పద్యాలు ఇందులో అగ్నిజ్వాలలుగా నిలుస్తాయి. 1930లో సామాజిక కల్లోలమే ఈ కవితలకు ప్రాణం. అలంకార కవిత్వాన్ని తోసిపుచ్చి, అభ్యుదయ కవిత్వానికి బాట వేసిన గ్రంథమిది. ‘మహా ప్రస్థానానికి ముందు- తర్వాత’ అనే విభజనకు కారణమైన ఈ సంపుటి, తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయి.
News December 18, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్(HURL)లో 33 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెక్నికల్ అప్రెంటిస్‌కు డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు BE, B.Tech, B.Com, BBA, BSc ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. అప్రెంటిస్‌లు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hurl.net.in


