News March 23, 2025
సూర్యాపేట: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమిలలో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలిలా.. యాట సైదులు (55) ఆదివారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.చికిత్స కోసం సూర్యాపేట తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం HYD ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు. సైదులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 15, 2025
NLG: మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో?!

నల్గొండ జిల్లాలో 8, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 427 వార్డులు.. 6,61,113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మున్సిపాలిటీలకు జనవరి 25, 2025న గడువు ముగిసింది. అప్పటినుంచి పాలకవర్గాలు లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 15, 2025
నిజామాబాద్: నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో 17న ఎన్నికలు జరగనున్నాయి.165 సర్పంచ్ స్థానాల్లో 19 ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్, 1,620 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 3,26,029 మంది ఓటర్లు ఉన్నారు.
News December 15, 2025
సీడ్ పార్కు… 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలు

TG: విత్తన ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా సీడ్ రీసెర్చ్ పార్కు నెలకొల్పనుంది. అలాగే కొత్తగా 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 25 లక్షల టన్నుల అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి కోసం ‘Inland seed Export facilitation port’నూ నెలకొల్పనున్నట్లు TG రైజింగ్ డాక్యుమెంట్లో తెలిపింది.


