News March 9, 2025
సూర్యాపేట: సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం

కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరి ఎంపిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఒక ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్సీ పేరును సీపీఐ ప్రకటించాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
News March 10, 2025
విశాఖలో క్రికెట్ బెట్టింగ్.. బుకీ అరెస్ట్: సీపీ

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతుంటాడని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం తెలిసిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
News March 10, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 10 నుంచి ఇంటర్మీడియట్ వాల్యూయేషన్ చేయనున్నట్లు జిల్లా అధికారి గోవిందారం తెలిపారు. 10న సంస్కృతం, 22న ఫిజిక్స్, 24న ఎకనామిక్స్, 26న కెమిస్ట్రీ, కామర్స్, 28న చరిత్ర, బాటని, జువాలజీ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.