News April 25, 2024
సెకండియర్ ఫలితాల్లో నారాయణపేటకు 34వ స్థానం
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 64.75శాతంతో రాష్ట్రంలో వనపర్తి 20వ స్థానంలో నిలిచింది. 4888 మందికి 3165 మంది పాసయ్యారు. 64.21%తో MBNR 22వ స్థానంలో నిలిచింది. 7909కి 5078 మంది పాసయ్యారు. 62.82%తో గద్వాల 23వ స్థానంలో నిలిచింది. 2948 మందికి 1852 మంది పాసయ్యారు. 59.06%తో నాగర్ కర్నూల్ 32 వస్థానంలో నిలిచింది. 4942కి 2918 మంది పాసయ్యారు. 53.81%తో NRPT 34 వస్థానంలో నిలిచింది. 3386 మందికి 1822 మంది పాసయ్యారు.
Similar News
News January 8, 2025
MBNR: తగ్గిన ధరలు.. టమాటా రైతుల ఆందోళన
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు సీజన్లలోనూ 1,690 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేశారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.25-30 పలకగా.. ప్రస్తుతం రూ.10కి పడిపోయింది. పట్టణంలోని రైతుబజార్‌లో రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. పంట ఉత్పత్తి పెరగడం, రైతులంతా ఒకేసారి మార్కెట్లకు పంట దిగుబడులు తీసుకురావడంతో ధరలు పడిపోయాయని ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు.
News January 8, 2025
MBNR: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేవరకద్ర మండలంలో జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొని ఇద్దరు, జడ్చర్ల సమీపంలో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఓ వ్యక్తి, మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి సమీపంలో లారీ ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందారు. ఈ ఘటనల్లో తీవ్రగాయాలైనవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
News January 8, 2025
MBNR: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.