News March 19, 2025
సెగలుకక్కుతున్న వనపర్తి

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పెబ్బేరులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేతపల్లి 39.8, పెద్దమందడి 39.7, వీపనగండ్ల 39.6, గోపాల్ పేట 39.6, రేమద్దుల 39.6, విలియంకొండ 39.5, కానాయిపల్లి 39.5, జానంపేట 39.5, వెలుగొండ 39.5, దగడ 39.4, వనపర్తి 39.4, మదనపురం 39.3, పానగల్ 39.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 19, 2025
వరంగల్: అందంగా రూపుదిద్దుకున్న అస్తమయం..!

వేసవికాలంలో సూర్యుడు అగ్నిగోళాన్ని తలపిస్తుంటాడు. ప్రస్తుతం మార్చి నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచి అలా వేడెక్కి సూర్యుడు సాయంత్రానికి కాస్త శాంతిస్తాడు. అలాగే సాయంత్రం వేళ అందంగా కూడా కనిపిస్తాడు. వరంగల్ లోని హంటర్ రోడ్ లో బుధవారం ఇలా సూర్యాస్తమయం ప్రజలను ఆకట్టుకుంది. SHARE

నకరికల్లు: రీ సర్వేపై రైతులతో మాట్లాడిన కలెక్టర్

నకరికల్లు మండలంలో జరుగుతున్న రీ సర్వేపై కలెక్టర్ అరుణ్ బాబు నేరుగా రైతులతో బుధవారం మాట్లాడారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. రైతుల వైపుగా ఉండే ఇబ్బందులు, సర్వేకు సంబంధించిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితమైన వివరాలతో విస్తరణతో సర్వేను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.